వృషభరాశి

ఈ మాసంలో వ్యక్తిగత జీవిత విషయాలలో అశాంతి, అసంతృప్తి కలిగించు సంఘటనలు ఏర్పడును. సొంత మనుష్యలతో చికా కులు మానసిక ఆవేదనను ఏర్పరచును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగించును. ధనాదాయం సామాన్యం. భూమి లేదా గృహం వంటి స్థిరాస్థి కొనుగోలు ఈ మాసంలో మంచిది కాదు. ఆధ్యాత్మిక మార్గం అవసరం. కుటుంబ వసతులకు వ్యయం చేయుదురు. నూతన ఆలోచనలకు కూడా ఇది మంచి సమయం కాదు. ముఖ్యమైన కార్యములను వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో మాటలందు జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 14, 15, 18 తేదీలు మంచివి కాదు.