ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండును. లేదా ఒక చిన్న వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. జల సంబంధ ప్రయాణాలు చేయవలసి వచ్చిన జాగ్రత్త వహించవలెను. మత్స్యకారులకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ద్వితీయ తృతీయ వారాలలో ఆర్థిక లావాదేవీలు లాభాలను కలుగచేయును. సమస్యల నుండి జగన్మాత అనుగ్రహం వలన బయటపడుదురు. మాసాంతానికి మానసిక ప్రశాంతత , ఆనందం పొందుదురు. ఆశిస్తున్న వర్తమానాలు అందును.
<no title>