| | మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ, సంప్రదాయంలోనూ అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. ఆషాడం అనగానే మనకు గుర్తుకు వచ్చే విషయం. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగాఅత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదని, పెళ్ళైన తొలి ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళూ ఒకే గడప దాటకూడదనేది మన తెలుగు వారి సంప్రదాయం. సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. ఆషాడ మాసంలో భార్యా భర్తలు కలిసి ఉంటే, గర్బం ధరించి బిడ్డ పుట్టేసరికి చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. అంటే ఎండాకాలం ప్రారంభం, ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు, ఆషాడంలో మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం, పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దల ఆచారం గా పెట్టారు, అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ పూర్వకాలంలో భావించేవారు. అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భ ధారణ జరి గితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసు కుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటా రు కూడా. ఇంకా ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు అత్తగా రింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ మాసం లో పొలం పనులు అప్పుడప్పుడే ప్రారంభమౌతుంటాయి. కాబట్టి, ఈ సమ యంలో కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు సరిగా చేయలేరోమోనన్న విషయాన్ని గ్రహించే ఆనాటి పెద్దలు అలా పెట్టుంటారంటారు. పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యా యతలు, ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి అర్థం అవుతుందనే అలా చేస్తుంటారు. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూదనే అభిప్రాయం వారికి కలుగజేస్తుంది. . ఆషాడంలో పెళ్ళిళ్లు చేయరెందుకనీ? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసంగా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం,జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషా డంలో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయ కాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు,గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమ వుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణా యనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవత లకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. |ఆషాడ మాసం ఆరంభం అవుతుందంటేనే... అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాడమాసం శుభకా ర్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్య తను ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరి స్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే.. పెళ్లిని.. మూడు నెలలు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ.. ఆషాడ మాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటా రు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే.. ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు కోడలు పుట్టింటికి ఎందుకు ? కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడి గా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భందాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భందాల్చడం వల్ల వేసవిలోప్రసవం జరు గుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యా భర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
ఆషాడ మాసం